'వైయస్' జగన్ ఫ్యామిలీ వెలి!

YS Jagan-YS Rajasekhar Reddy
వైయస్ రాజశేఖర రెడ్డి పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఆయన కుటుంబాన్ని వెలేసేందుకు సిద్ధమవుతున్నారట. అవినీతి ఆరోపణలతో వైయస్ తనయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జైలులో ఉన్నారు. తాజాగా అగస్టా హెలికాప్టర్ కొనుగోలు విషయంలో వైయస్ పేరు తెరపైకి వచ్చింది.

ఇలా వరుస ఆరోపణలకు తోడు క్రైస్తవ ఛారిటబుల్ ఫౌండేషన్‌ను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వైయస్ కుటుంబాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళిత క్రైస్తవుల నుంచి వెలేస్తున్నట్లు తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య కన్వీనర్ మత్తయ్య అన్నారు. అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు, నిధుల దుర్వినియోగంతో పాటు.. వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ మత సంస్థల పేరుతో కోట్లాది రూపాయల నిధులను మళ్లించడం దారుణమని అన్నారు.

అగస్టా హెలికాప్టర్ కొనుగోలు కుంభకోణం ఉదంతంలో క్రైస్తవ మిషనరీ సంస్థ ఆర్బోర ఫౌండేషన్‌కు పాత్ర ఉండడం విచారకరమని ఆరోపించారు. వైయస్ పాలనలో ప్రత్యక్షంగా ఆర్బోరాను వినియోగించుకోవడం నిజమైన క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలకు నిరసనగా త్వరలో ఇందిరాపార్క్ వద్ద పదివేల మందితో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+