భార్యల నుంచి భద్రత కావాలట..

మహిళలకు మాదిరిగానే తమకు కూడా రక్షణ కల్పించాలని, మహిళా చట్టాల పేరుతో పురుషుల హక్కులను కాలరాయడం దారుణమని భార్యా బాధితుల రాష్ట్ర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన భార్యాబాధితులు తమ ఆవేనదను వెళ్లగక్కారు. రెండు రోజులపాటు జరిగే సమావేశాల తొలి రోజున భార్యలు, వారి కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా వేధింపులను ఎదుర్కుంటున్నామనే విషయాలను పంచుకున్నారు.
త్వరలో రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రామకృష్ణ తెలిపారు. 498(ఏ) యాక్టుని సవరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా గొలుగూరి బాల చంద్రశేఖరరెడ్డిని ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications