వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అనగానే రాహుల్ లేచిపోయారు!

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నుంచి తెలంగాణకు చెందిన ఎఐసిసి కార్యదర్సి పొంగులేటి సుధాకర్ రెడ్డికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఎఐసిసి కార్యదర్శుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.

తెలంగాణ అంశాన్ని సుధాకర్ రెడ్డి లేవనెత్తగానే రాహుల్ గాంధీ లేచి వెళ్లిపోయారని చెబుతున్నారు. అయితే, తెలంగాణ అంశంపై విడిగా చర్చిద్దామని, దాని గురించి ఆలోచిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పినట్లు సుధాకర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. తెలంగాణ అంశాన్ని పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ కాస్తా అసౌకర్యానికి గురి కావడంతో పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి సూచనలు ఇవ్వాలని ఆజాద్ సూచించారట.

తెలంగాణ అంశం కూడా పార్టీని పటిష్టం చేయడంలో ఒక భాగమని సుధాకర్ రెడ్డి చెప్పారని అంటున్నారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తే, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలోపేతం అవుతుందని సుధాకర్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. కానీ, రాహుల్ గాంధీ ఆ మాట వినడానికి ఇషటపడలేదని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాహుల్ గాంధీయే కాస్తా వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, తెలంగాణను తేల్చే విషయం మాత్రం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీన తెలంగాణపై సమావేశం ఏర్పాటు చేస్తామని తాజాగా కేంద్ర మంత్రి వాయలార్ రవి చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి విడిగా కసరత్తు జరుగుతున్నందున ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదనేది రాహుల్ ఆంతర్యమని తెలంగాణ నేతలు సర్దిచెప్పుకుంటున్నారు.

English summary
It is said that AICC vice president Rahul Gandhi has not shown interest to hear on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X