వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘువీరా: సిఎంగానా, పిసిసి చీఫ్‌గానా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంత్రి రఘువీరా రెడ్డి ముఖాముఖి చర్చలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రఘువీరా రెడ్డికి అంతగా ప్రాధాన్యం ఇచ్చి సోనియా గాంధీ ఎందుకు మాట్లాడారనే విషయంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పైగా, పార్టీకి, ప్రభుత్వానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారని సోనియాతో భేటీ తర్వాత రఘువీరారెడ్డి నర్మగర్భంగా మాట్లాడడం కూడా అందరినీ ఆలోచనలో పడేసింది.

రాయలసీమకు చెందిన బిసి రఘువీరారెడ్డికి సోనియా గాంధీ కీలకమైన బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించుకున్నారని, అందుకే ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో రఘువీరా రెడ్డిని నియమించవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. లేదంటే పిసిసి అధ్యక్షుడిగా ఆయనను నియమించే అవకాశాలున్నాయా అనే కోణంలో కూడా ఆలోచన సాగుతోంది.

పార్టీని గాడిలో పెట్టి వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోకసభ స్థానాలను రాష్ట్రం నుంచి గెలుచుకునే దిశలో కాంగ్రెసు అధిష్టానం ప్రణాళికను తయారు చేస్తోందని, ఇందులో భాగంగా అవసరమైతే ముఖ్యమంత్రిని గానీ పిసిసి అధ్యక్షుడిని గానీ మార్చవచ్చునని అంటున్నారు.

రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు గతంలో ప్రచారం సాగింది. ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే రఘువీరా రెడ్డి దూరం జరగడంపై కూడా అనుమానాలు రేకెత్తాయి. అయితే తాను ముఖ్యమంత్రి రేసులో లేనని రఘువీరా రెడ్డి చెప్పారు. మొత్తం మీద, కాంగ్రెసులో భారీ మార్పులు జరగడానికి సంకేతంగా రఘువీరా రెడ్డితో సోనియా గాంధీ మంతనాలను భావిస్తున్నారు.

English summary

 Sonia Gandhi who had called Raghuveera Reddy for a meeting to discuss the party affairs. And it was surprising to listen from Raghuveera that there were going to be major changes in the party and the government very shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X