కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వీరభక్తుడు: సిఎం కిరణ్ రెడ్డికి వంత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sai Pratap
కడప: కడప జిల్లా రాజంపేట కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం బహిరంగ విషయమే. ఆ సాన్నిహిత్యంతో ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులోకి దూకుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. వైయస్ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించారు.

కేంద్ర మంత్రి పదవి ఊడిన తర్వాత ఆయన కాస్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమంటూ ముమ్మరంగా ప్రచారం సాగింది. కానీ ఇటీవల ఆయన తన ఉద్దేశాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

ఆదివారంనాడు ఆయన జిల్లాలోని రామాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి కితాబుల మీద కితాబులు ఇస్తూ వెళ్లారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆకాశానికెత్తారు.

ఈ మధ్య కాలంలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఎవరినీ దూషించలేదన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. దీన్ని బట్టి సాయి ప్రతాప్ కాంగ్రెసులోనే ఉండడానికి నిర్ణయించుకున్నారనే ప్రచారం ప్రారంభమైంది.

English summary

 Kadapa MP Sai Pratap is in a bid to switch loyalities towards CM Kiran kumar Reddy from YSR Congress president YS Jagan. Indiacating the move Dai Pratap praised Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X