సమైక్య సెంటిమెంట్: లగడపాటికి నో జగన్‌కు ఓకే

YS Jagan-Lagadapati Rajagopal
తెలంగాణపై కేంద్రం తనకు తానుగా విధించుకున్న గడువు(ఈ నెల 28) దగ్గర పడుతుండటంతో తెలంగాణ, సమైక్యాంధ్ర వేడి రాజుకుంటుంది. ఇరు ప్రాంతాల నేతలు ఎవరికి వారు తమ తమ వాదనలకు అనుకూలంగా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సీమ ప్రాంతానికి చెందిన మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు అధిష్టానం నేతలను కలిసినప్పుడు తెలంగాణలో సెంటిమెంట్ ఉందని, సీమాంధ్రలో లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. వారే కాదు. స్వయంగా డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి సీమ నేతలే దానిని చెబుతున్నారు.

అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాస రావు వంటి వారు సీమాంధ్రలోనూ సెంటిమెంట్ బలంగానే ఉందని చెబుతున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగదనే భావనతో తమ ప్రాంత ప్రజలు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని, అదే జరిగితే ఉద్యమం ఎగిసిపడుతుందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని మరికొందరు కొట్టి వేస్తున్నారు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. సీమాంధ్రలో సమైక్య సెంటిమెంట్ బలంగా ఉంటే.. 2004లో కాంగ్రెసు, 2009లో టిడిపి తెరాసలు పొత్తు ఎలా పెట్టుకున్నాయని, అప్పుడు ఆ ప్రాంత నేతలు ఎందుకు అడగలేదంటున్నారు.

2009 డిసెంబర్ 9వ తేదిన తెలంగాణపై ప్రకటన వచ్చినప్పుడు కూడా సీమాంధ్ర నేతలో హడావిడిగా స్పందించారు తప్ప ప్రజల నుండి అంతగా స్పందన కనిపించలేదంటున్నారు. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్.. కాంగ్రెసుకు ఒటేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని, జగన్‌కు ఓటేస్తే తెలంగాణకు అనుకూలమవుతుందని ప్రచారం చేశారు. కానీ జగన్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని అంటున్నారు. సీమాంధ్రలో జై ఆంధ్ర, రాయలసీమ ఉద్యమాలు జరుగుతున్నాయని కానీ, తెలంగాణలో సమైక్యాంధ్ర ఉద్యమాలు లేవని అంటున్నారు. సీమాంధ్రుల్లో సమైక్య భావన బలంగా లేదనడానికి ఇవే మంచి నిదర్శనాలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+