వైయస్ జగనే దిక్కు: కావూరి స్థానంలో కెవిపి?

సమైక్యాంధ్రపై కావూరి సాంబశివ రావు రాజీమార్గం పట్టడంతో వారికి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కెవిపి రామచంద్రరావు వైపు సీమాంధ్ర నాయకులు చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసుతోనే ఉంటామని వైయస్ జగన్ ప్రకటన చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోతుందని వారు నమ్ముతున్నారు. గతంలో ఓసారి వైయస్ జగన్‌తో అవగాహన కుదురుస్తానని పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చి తెలంగాణపై కెవిపి రామచంద్రరావు తెలంగాణపై ప్రకటనను ఆపించినట్లు వార్తలు వచ్చాయి.
జగన్‌తో ఎన్నికలకు ముందే ఓ అవగాహన కుదుర్చుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుందని భావించి, ఆ ప్రయత్నాలను కెవిపి చేసినట్లు సమాచారం. అయితే, వైయస్ జగన్ అందుకు అంగీకరించలేదని, దాంతో పార్టీ అధిష్టానం మళ్లీ విభజనను ముందుకు తెచ్చిందని అంటున్నారు. తాజా పరిస్థితిలో కూడా అదే మంత్రం అధిష్టానంపై పని చేస్తుందని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడిందని విస్తృతమైన ప్రచారం సాగుతున్న క్రమంలో శుక్రవారంనాడు కెవిపి రామచంద్రరావు నివాసంలోనే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వెనక కెవిపి రామచందర్ రావు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. నేరుగా వారితో కలిసి నడవకపోయినా వెనక నుంచి ఆయనే నడిపిస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications