జనం లేరు: పార్టీ నేతలపై షర్మిల ఆగ్రహం

Sharmila
విజయవాడ: తన పాదయాత్రకు ప్రజలు కరువు కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పాదయాత్రకు జనసమీకణలో విఫలమయ్యారని కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై ఆమె మండిపడ్డారు. ఆమె పాదయాత్ర బుధవారం ఉదయం 9 గంటలకు వీరులపాడు మండలం గూడెం మాధవవరం నుంచి ప్రారంభమైంది.

గ్రామంలో పెద్దగా స్పందన కనిపించలేదు. మూడు కిలో మీటర్లు నడిచాక ఆమె పాదయాత్రను విరమించి పది గంటలకు బస్సు ఎక్కారు. కార్యకర్తలు వచ్చేవరకు పాదయాత్ర ప్రారంభించేది లేదని జిల్లా నాయకులతో తెగేసి చెప్పారు. దీంతో మైలవరం, కంచికచర్ల మండలాల నుంచి, సమీపంలో గల ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నుంచి కార్యకర్తలను తరలించే కార్యక్రమాన్ని నాయకులు చేపట్టారు. సాయంత్రం కార్యకర్తలు రావడంతో షర్మిల తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.

కరెంట్ నిల్... బిల్లుపుల్... అన్నట్లుగా రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి దాపురించిందని షర్మిల ఆరోపించారు. వీరులపాడు మండలం జయంతి బహిరంగసభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అండ ఉండటం వల్లే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షర్మిల వ్యాఖ్యానించారు. వైయస్ జగన్‌ను వేరే రాష్ట్రానికి తరలించే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.

రాజన్న కాలంలో కళకళలాడే పల్లెసీమాలు నేడు నిత్యం కనీళ్ళు పెడుతున్నాయని షర్మి ఆవేధన వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణయుగంలో ఒక్క రూపాయి కరెంటు చార్జీ పెంచాలేదని ప్రస్తుత పాలకులు మ్త్రాం ప్రజలపై మోయలేని భారాలు వేసి ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం తెస్తారని వారికి భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+