శేషప్రశ్నలు: రాయల టికి ఇంకా అవకాశముందా?

Unanswered questions over T announcement
తెలంగాణ ఏర్పాటుకు యూపిఏ, కాంగ్రెసు పార్టీ పచ్చ జెండా ఊపింది. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణను ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగనుంది! అయితే కాంగ్రెసు పార్టీ చేసిన తీర్మానం పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలన్ని నిర్ణయం, తెలంగాణలో మరిన్ని జిల్లాలను కలపాలని డిమాండ్లు వస్తే వాటిని పరిశీలిస్తామని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ ప్రకటన వెనుక సమాధానాలు చెప్పాల్సిన అంశాలు చాలా దాగి ఉన్నాయి. అంటే ముందు ముందు డిమండును బట్టి రాయల తెలంగాణకు అవకాశాలు లేకపోలేదని ఆ ప్రకటన అంతరార్థమని అంటున్నారు.

ఈ పదేళ్ల పాటు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందా లేక తెలంగాణ రాష్ట్రం పాలనలో కొనసాగుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దిగ్విజయ్ దాట వేశారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ ఉపసంఘం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.

ఇరు ప్రాంతాలకు హైకోర్టు పదేళ్లపాటు హైదరాబాదులో కొనసాగే అవకాశముంది. ప్రస్తుతం ఇదే తరహాలో ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న చండీగఢ్‌లో పంజాబ్, హర్యానా పేరిట ఉమ్మడి హైకోర్టు నడుస్తోంది. అయితే దిగ్విజయ్ చండీగఢ్‌తో హైదరాబాదును పోల్చవద్దని చెప్పారు. హైదరాబాదుకు సీమాంధ్ర ప్రాంతంతో భౌగోళిక సంబంధం కూడా లేదని చెప్పారు.

పదేళ్లలోపే సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మించాల్సి ఉందని చెప్పిన దిగ్విజయ్, పదేళ్ల పాటు హైదరాబాదు నుండి వచ్చే ఆదాయాన్ని ఏ నిష్పత్తిలో పంచుతారో తేలాల్సి ఉంది. రాష్ట్ర విభజనకు సంబంధించి సరిహద్దులు, జలాలా, విద్యుత్తు, ఆస్తులు, అప్పుల పంపిణీలో మంత్రివర్గ ఉపసంఘం ఎవర్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్ పైన మరింత స్పష్టత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+