కిరణ్‌కు 'పవర్' సెగ: వైయస్ పైన నింద?

ప్రభుత్వ నిర్ణయంపై దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఘాటైన లేఖ రాశారు. ఇలా అయితే 2014లో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రాగలదా అని ప్రశ్నించారు. అయితే ఈ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు దారి తీసిన పరిణామాలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే అనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పలు అంశాలపై వైయస్‌ను, కాంగ్రెసును బాధ్యులుగా చేస్తూ వస్తోంది.
తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణం దివంగత వైయస్ కారణమని విమర్శిస్తున్నారు. ఇష్టారీతిగా ముందస్తు ప్లాన్ లేకుండా ఉచిత విద్యుత్ ఇవ్వడం, 2009 ఎన్నికలకు ముందు పక్క రాష్ట్రాల నుండి విద్యుత్‌ను ఎక్కువ రేటుకు కొనుగోలు చేయడం తదితరాల కారణంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. నాటి విద్యుత్ బకాయిలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అంటున్నారు.
వాటిని ఇప్పటికీ మనం సర్‌ఛార్జీల రూపంలో కడుతూనే ఉన్నామని చెబుతున్నారు. ఈ సంవత్సరం ముగిసే వరకు వాటిని కట్టాల్సిందే అంటున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం కూడా మరో కారణమంటున్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.












Click it and Unblock the Notifications