జగన్‌కు బెయిల్‌పై పార్టీ ఆశలకు మోజులు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోల విషయంలో మంత్రులపై, ఐఎఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి తోడు, రాష్ట్ర మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాదులోని సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.
ఈ పరిణామాలు తమ నేత జగన్‌కు బెయిల్ రావడానికి ఉపయోగపడుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. సిబిఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్థితిలో వైయస్ జగన్‌కు బెయిల్ లభించి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి వెంకటరమణ ఇప్పటికే జైలులో ఉన్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి పేర్లను సిబిఐ చార్జిషీట్‌లో నిందితులుగా చేర్చింది.












Click it and Unblock the Notifications