జగన్ కొడ్తారేమోనని భయం: ఎమ్మెల్యే వ్యాఖ్య

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతిభద్రతలపై వాడిగా వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నవ్వుల పువ్వులు పూయించారు. శాసససభలో జగన్‌ను చూస్తుంటే తనను కొడతారేమోనని భయమేస్తుందన్నారు.

తనను అన్యాయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల వైపు కూర్చోపెట్టారని, ఎప్పుడు ఆవేశంలో ఎవరొచ్చి తనను కొడతారనే భయంతో తాను శాసనసభలో గడుపుతున్నానని తెలిపారు. జగన్ మానసికప్రవర్తన సరిగ్గా ఉన్నట్టు అనిపించడం లేదని, జగన్‌కు వెంటనే సెలవు ఇచ్చి ఆసుపత్రిలో చేర్చాలని ఆయన సూచించారు.

AP assembly: BJP MLA comments on YS Jagan

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల పక్కన కూర్చోవడం ఒక పక్క భయంగానే ఉందని, దయచేసి సీటు మార్చి విముక్తి కలిగించండి సార్ అంటూ స్పీకర్‌ను విష్ణుకుమార్ కోరారు. రాజకీయ హత్యలపై జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేస్తుంటే, వాటిని ఎదుర్కోవడానికి అధికార పక్ష సభ్యులు ఎదురు దాడికి దిగుతున్నారు.

శనివారంనాడు శాసనసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి సభ్యుడు బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిగా టిడిపి సభ్యులు ఎదురు దాడికి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+