మసాజ్ సెంటర్: రెచ్చగొట్టి వ్యభిచారం, ఎయిడ్స్?

బెంగళూర్: మసాజ్ సెంటర్‌కు వెళ్తే రెచ్చగొట్టి వ్యభిచారం చేయించారని, దానివల్ల ఎయిడ్స్ వచ్చిందని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ బెంగళూర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మెయిల్ ద్వారా అతను తన ఫిర్యాదును పంపించాడు. మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి.. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని, అలా వెళ్లిన తనకు హెచ్‌ఐవీ సోకిందని బాధితుడు తెలిపాడు. స్పందించిన పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

బెంగళూర్‌లోని పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని దొమ్మలూరులో ఉస్మాన్ అనే వ్యక్తి ఓ మసాజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీకి చెందిన యువతులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని బాదితుడు ఫిర్యాదు చేశాడు. వార్తాకథనాల ప్రకారం - యువతుల అర్ధనగ్న ఫొటోలతో ఇంటర్నెట్‌లో ప్రచారం చేశాడు. మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి యువతులతో వ్యభిచారం చేయించసాగాడు.

Complain against massage centres in Bangalore

విటులను ఆకర్షించడానికి ముగ్గురు పింప్‌లను పెట్టాడు. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి (29) కొద్ది రోజుల క్రితం ఆ మసాజ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఒక యువతికి రూ. 25 వేలు చెల్లించి లైంగిక కోర్కెలు తీర్చుకున్నాడు. ఇటీవల పదేపదే జ్వరం వస్తుండటంతో ఈనెల 11న ఆస్పత్రికి వెళ్లిన అతనికి హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ బాధితుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.

మసాజ్ కేంద్రం ముసుగులో వ్యభిచారం చేయిస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు సోమవారం రాత్రి ఆ కేంద్రంపై దాడి చేశారు. ముగ్గురు పింప్‌లను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+