పురంధేశ్వరితో బాలయ్య: తిక్కవరపు ప్రకటన
విశాఖపట్నం: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు, ఆమెను పార్టీలోకి తెచ్చేందుకు ఆమె సోదరుడు, నందమూరి హీరో బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. దాంతో ఆమె కదలికలపై అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాను విశాఖకు పోటీకి రావడం లేదని తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి చేత ప్రకటన చేయించినట్లు చెబుతున్నారు.
దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ మారతారని వెలువడుతున్న వార్తలపై కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆరా తీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గతంలో కన్నా భిన్నంగా స్పందించారని అంటున్నారు. రానున్న సాధారణ ఎన్నికలలో పురంధేశ్వరి విశాఖప ట్నం నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభకు పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.

పురంధేశ్వరి కోసమే తనను మూడోసారి రాజ్యసభకు అధిష్టానం ఎంపిక చేసిందని సుబ్బిరామిరెడ్డి స్పష్టంగా చెప్పారని అంటున్నారు. పురంధేశ్వరి విజయం కోసం తాను కృషి చేస్తానని కూడా ఆయన తేల్చిచెప్పారు.
పార్టీ కేంద్ర నాయకత్వమే సుబ్బిరామిరెడ్డి చేత ఆ విధంగా ప్రకటన చేయించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని సుబ్బిరామిరెడ్డి చెప్పారు. దగ్గుబాటి దంపతులు ఏం చేస్తారో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications