యూ టర్న్, అది రహస్యం!: నేతాజీ వివరాలపై బీజేపీ ట్విస్ట్
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోసు అదృశ్యం పైన రహస్య పత్రాల వెల్లడికి ఒకనాడు పట్టుబట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు కేంద్రంలో తానే అధికారంలో ఉండి ఆ సమాచారం వెల్లడికి తిరస్కరించింది. విపక్షంలో ఉండగా సదరు రహస్య పత్రాలన్నీ బహిర్గతం చేయాల్సిందేనని నాటి యూపీఏ ప్రభుత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కింద నేతాజీ సమాచారం కోసం సామాజిక కార్యకర్త సుభాష్ అగ్రవాల్ దరఖాస్తు చేశారు. అయితే, వీటిని వెల్లడిస్తే కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటూ పీఎంవో నిరాకరించడం గమనార్హం.
నేతాజీ అదృశ్యం, దానికి సంబంధించిన సుమారు రహస్య ఫైళ్లను బహిరంగ పర్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. గత జనవరిలో లోకసభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకున్న దశలో అప్పటి బీజేపీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ నేతాజీ 117వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలమైన కటక్‌ను సందర్శించారు.

నేతాజీకి సంబంధించిన రికార్డులన్నిటినీ బహిర్గతం చేయాలని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాజ్‌నాథ్ హోంమంత్రిగా ఉన్నారు.
నేతాజీకి సంబంధించి 41 ఫైళ్లు ఉన్నాయని, వాటిలో రెండు ఫైళ్లను రహస్య ఫైళ్ల జాబితా నుంచి తొలగించడం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద ఇటీవల ఇచ్చిన ఓ సమాధానంలో పిఎంఓ అంగీకరించింది. అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏ కారణాలతో ఈ ఫైళ్లను బహిర్గతం చేయడానికి నిరాకరించిందో అదే కారణంతోనే ఈ ఫైళ్లను బహిర్గతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కూడా నిరాకరిస్తోంది.












Click it and Unblock the Notifications