తొలగిన అడ్డంకి: హాత్‌వే ద్వారా టీవీ9 టెలికాస్ట్
హైదరాబాద్: సుదీర్ఘ కాలం తర్వాత టీవీ9 ప్రసారాలకు తెలంగాణలో అడ్డంకులు తొలగిపోయాయి. టెలికం వివాదాల సెటిల్‌మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో గత 144 రోజుల నిషేధానికి తెర పడింది. వివాదాల నేపథ్యంలో ఎంఎస్‌ఓలు టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ప్రసారాల నిలిపివేత ఆ రెండు చానెళ్లకు చెందిన జర్నలిస్టులు ఆందోళనలు కూడా చేపట్టారు. ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపేసిన ఎఎస్ఓలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షించారు కూడా. ఆ చానెళ్ల ప్రసారాలను ఆపేసినందుకు వారిని ఆయన అభివనందించారు.

తెలంగాణ శాసనసభ్యులపై ఓ కార్యక్రమంలో టీవీ9 అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో హాత్‌వే వంటి కొంత మంది ఎంఎస్ఓలు టీవీ9పై నిషేధం ఎత్తేశారని తెలంగాణ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు ఎం. సుభాషణ్ రెడ్డి ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అన్నారు.
టీవీ9 హాత్‌వేతో ఒప్పందం చేసుకుందని, దాంతో ప్రసారాలను పునరుద్ధరించిందని చెబుతున్నారు. డిగీ, సిటీ విజన్, ఇన్ - డిజిటల్, శుభోదయ, ఆర్వీఆర్, వనస్థలిపురం కమ్యూనికేషన్స్, భాగ్యనగర్ కేబుల్స్ వంటివి ప్రసారాలను పునరుద్ధరించలేదు. ఏర్పాటు ఏదీ లేకపోవడంతో ఇవి ప్రసారాలను పునరుద్ధరించలేదు. నవంబర్ 5వ తేదీలోగా టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications