వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత: కూతురి పెళ్లిని అప్పుగా చూపిన నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు అందజేసే అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు వివరాలు ఇవ్వడం మాత్రమే ఇప్పటివరకూ మనం చూశాం. అయితే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు కుమార్తె పెళ్లిని అప్పుగా చూపించారు. నామినేషన్లతో పాటు దాఖలు చేసే అఫిడవిట్‌లో అప్పుల జాబితా కాలమ్ ఉంటుంది.

యూసుఫ్ భట్ అనే కాంగ్రెస్ అభ్యర్థి ఆ కాలమ్‌లో కూతురి పెళ్లిని అప్పుగా రాశారు. సెంట్రల్ కాశ్మీర్‌లోని గండేర్‌బల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భట్ పోటీ చేస్తున్నారు. లయబిలిటీ కాలమ్‌లో ‘అన్ మ్యారీడ్ డాటర్ మ్యారేజ్' అని రాశారు. అయితే తాను ఇచ్చిన అఫిడవిట్‌ను భట్ సమర్ధించుకున్నారు.

J&K Cong candidate mentions daughter's marriage as liability in poll affidavit

తన కూతురుని తాను ఎప్పుడూ భారం అనుకోలేదని, తన కొడుకు సంపాదిస్తున్నాడని, కూతురుకు ఎలాంటి సంపాదన లేదని, కాబట్టి ఆమె తన మీద ఆధారపడి ఉందని, ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత తనదేనని ఆయన వివరణ ఇచ్చారు. ‘అఫిడవిట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు' భట్ అంటున్నారు. పైగా కుమార్తె పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రిగా తనకుందని, ఆమె సంపాదపాపరురాలు కాకపోతే అది మరింత బాధ్యతతో కూడుకున్నదని ఆయన అన్నారు.

పెళ్లి చేయాలంటే బ్యాంకు నుంచి రణం తీసుకోవాలని, అదే తాను అఫిడవిట్‌లో చెప్పానని భట్ తెలిపారు. అంతేతప్ప కూతురును అప్పుగా తాను చూపలేదన్నారు. ఇటీవలే ఎన్‌సిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన భట్ గండేర్‌బల్ నుంచి పోటీ చేస్తున్నారు. తాను, తనపై ఆధారపడిన భార్యతో పాటు నలుగురు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్న్ దాఖలు చేయలేదని కూడా చెప్పారు. తన కుటుంబం చరాస్తుల విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని, వాటిలో 10 లక్షల రూపాయల నగదు ఉందని భట్ చెప్పారు.

English summary
Sparking a controversy, a Congress candidate for the Jammu and Kashmir Assembly elections has mentioned the marriage of his daughter as a "liability" in his affidavit submitted along with his nomination papers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X