జైపాల్ రెడ్డి గ్రూప్ వ్యూహం: దిగ్విజయ్‌పై నెపం

న్యూఢిల్లీ: తమ ఓటమికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను నిందించేందుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెసు నేతలు సిద్దపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ ఓటమి పాలవ్వటంపై ఆ పార్టీకి చెందిన నేతలు గురువారం హస్తినలో తీవ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు.

కేవలం రెండు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు విజయం సాధించింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీగా నంది ఎల్లయ్య, నల్గొండ ఎంపీగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి గెలిచారు. మిగతా 15 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆఖరికి కేంద్ర మంత్రులు సైతం మట్టికరిచారు. తెలంగాణ ఇచ్చినా ప్రజలు ఎందుకు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టలేదనే బాధ ఆ పార్టీ నేతల్లో ఉంది. దీనికి కారణం ఎవరు అనే దిశగాకూడా ఆలోచనలు చేశారు.

Jaipal reddy group blames Digvijay Singh

మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, రాజయ్యలు, బలరామ్‌ నాయక్‌, వినోద్‌లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఎంపీల కింద ఉన్న ఎంఎల్‌ఏ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికలో ఎంపీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే కారణంగా తెలుస్తున్నది.

ఎంఎల్‌ఏ అభ్యర్ధులను ఎంపిక చేయటంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ విఫలమయ్యారని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. అలాగే ఎన్నికల వ్యయం కూడా సరిగా ఇవ్వకపోవటం మరో కారణంగా తెలుస్తునది. ఈ అంశంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+