తుమ్మల: కెసిఆర్, బాబు పోటీపడ్డారు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్వల్ప అస్వస్థత కారణంగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారనే వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పోటీపడి పరామర్శించారు.

సీనియర్ నాయకుడైన తుమ్మల నాగేశ్వర్ రావు, తనతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన భారీ నాయక గణంతో టిఆర్ఎస్‌లో చేరతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

ఒకరు తమ పార్టీలోనే ఉంచేందుకు ప్రయత్నిస్తుండగా.. మరొకరు తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలోని పలువురు నాయకులు, భారీ అనుచరగణంతో టిఆర్ఎస్‌లోకి చేరేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తుమ్మల నాగేశ్వర్‌రావును బుధవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.

టిడిపికి రాజీనామా చేసిన తుమ్మల సెప్టెంబర్ 5వ తేదీన టిఆర్‌ఎస్‌లో చేరతానని ప్రకటించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తుమ్మల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడంతో ఆయన్ను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తుమ్మల కోలుకోవడానికి కొంత వ్యవధి పట్టనుండటంతో తుమ్మల నాగేశ్వర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరిక కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉందని తెలిసింది.

కెసిఆర్

కెసిఆర్

తుమ్మల నాగేశ్వర్‌రావును బుధవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారనే వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పోటీపడి పరామర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

సీనియర్ నాయకుడైన తుమ్మల నాగేశ్వర్ రావు, తనతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన భారీ నాయక గణంతో టిఆర్ఎస్‌లో చేరతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+