చంద్రబాబుకు సత్య నాదెళ్ల అభినందనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మైక్రోసాఫ్ట్ సీఈఓ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ప్రాధాన్యతా రంగాల్లో ఐటీ కూడా ఒకటని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి తన ప్రమాణ స్వీకారానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగుబిడ్డ అయిన సత్య నాదెళ్లను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. అయితే, కంపెనీకి సంబంధించిన పలు కార్యక్రమాలు షెడ్యూల్ ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రాలేనని ఆయన చెప్పినట్లు తెలిసింది.

అదేసమయంలో ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు. ఈ ఏడాది చివరలో సత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుంటారని మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్గాలు తెలిపాయి.
హైదరాబాదుపై మైక్రోసాఫ్ట్‌కు ప్రత్యేకమైన దృష్టి ఉంది. సత్య నాదెళ్ల హైదరాబాదు పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా కలుస్తారా, లేదా అనేది చూడాల్సిందే.












Click it and Unblock the Notifications