రాజపక్సకి భారతరత్న:సుబ్రహ్మణ్యస్వామి సంచలనం

Subramanian Swamy pleads for Bharat Ratna to Rajapaksa
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటున్నారు. అతనికి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వామి విజ్ఞప్తి చేశారు.

శ్రీలంకలో ఎల్టీటీఈని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు రాజపక్షకు ఈ పురస్కారం ఇవ్వాలని స్వామి అభిప్రాయపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రధానికి ఓ లేఖ రాశారు. రాజపక్షకు భారతరత్న ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు తమిళవాసులకు ఏ మేరకు ఆగ్రహం తెప్పిస్తాయో చూడాల్సి ఉంది.

గతంలోను సుబ్రహ్మణ్య స్వామి తమిళుల ఆగ్రహం చూడగొన్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక రక్షణ సిబ్బంది తమిళనాడు జాలర్లను, బోట్లను నిర్బంధించాయి. దీనిపై తమిళనాడులోని అన్ని పార్టీలు స్పందించాయి. జాలర్లను, బోట్లను విడుదల చేయలని డిమాండ్ చేశారు.

అయితే, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తమిళ జాలర్లను విడిచి పెట్టాలని, బోట్లు ఇవ్వవద్దని చెప్పారు. దీని పైన అన్నాడీఎంకే, డీఎంకేతో సహా పలు తమిళ పార్టీలు, తమిళవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రహ్మమ్య స్వామి పైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సైతం అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+