పిడుగు: తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మ ఎపికి

రోస్టర్ బ్యాండ్ ప్రకారం కేటాయింపులు ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చారు. రాజీవ్ శర్మ కూడా ఆంధ్రప్రదేశ్‌కే ఎంపికయ్యారు. దీంతో, అధికార యంత్రాంగంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. విషయం తెలుసుకున్న రాజీవ్ శర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చర్చించారు.
ఏం ఫర్వాలేదని రాజీవ్ శర్మకు భరోసా ఇచ్చిన కెసిఆర్ ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఒకవేళ మా చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఆంధ్రాకు నియమితులైనా వారిని మాకే ఇవ్వండి' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శర్మ ఆంధ్రాకు వస్తే ఇక్కడ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వడం కుదరదని, దీంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న చంద్రబాబు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తెలంగాణ సిఎస్, డిజిపి ఇద్దరూ తమ రాష్ట్రానికి వచ్చినా తిరిగి తెలంగాణకు బదిలీ చేయడానికి వీలుగా నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వడానికి తనకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications