రిలాక్స్: ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు ఫేవర్?

తన భార్య పద్మావతి కోసం కోదాడ టికెట్ ఆశించారు. అయితే, ఆ సీటును పొత్తులో భాగంగా కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది. సిపిఐకి కేటాయించిన 8 సీట్లలో కోదాడ కూడా ఉంది. అయితే, ఆశ్చర్యకంగా ఆ సీటు కాంగ్రెసుకే ఉండిపోయింది.
కాగా, మిగతా కొమ్ములు తిరిగి కాంగ్రెసు నాయకులకు మాత్రం ఆ మినహాయింపు లభించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డిలో పోటీ చేయాలని అనుకున్నారు. జానారెడ్డి, డి. శ్రీనివాస్ తమ కుమారులకు సీట్లు ఆశించారు. షబ్బీర్ అలీ, మర్రి శశిధర్ రెడ్డి పరిస్థితి కూడా అదే.
సబితా ఇంద్రారెడ్డి కూడా తనకు శాసనసభ సీటును, తన కుమారుడు కార్తిక్ రెడ్డికి పార్లమెంటు సీటును ఆశించారు. కానీ, వారందరికీ ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అనే నిబంధనను ఆమలు చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహాయింపు ఇచ్చారు. మొత్తం మీద, గజిబిజి చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యకు టికెట్ తెచ్చుకున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications