వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం: జగన్ పార్టీ తప్పులో కాలేసిందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ పట్టుబడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దీనిపై శనివారం సభాపతి నాదెండ్ల మనోహర్‌కు పిటిషన్ ఇచ్చింది. అయితే, ఈ పిటిషన్ ఇచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తప్పులే కాలేశారట. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వారు సభాపతికి పిటిషన్ అందజేశారు.

అసెంబ్లీ రూల్స్‌లోని 167 ప్రకారం పిటిషన్ అందజేశారట. ఆ రూల్ కింద పిటిషన్లు ఏవైనా తన వద్దకు వస్తే సభాపతి వాటిని పిటిషన్ కమిటీకి పంపిస్తారు. దానిపై సభలో చర్చ జరగదు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించి ఏవైనా సమస్యలు, అధికారులు స్పందించకపోవడం, ఇతరత్రా అంశాలను పిటిషన్ల రూపంలో అందజేస్తారు.

YSR Congress

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ముగిసిన తర్వాత పిటిషన్లు ఏవైనా ఉన్నాయా? అని స్పీకర్ అడిగినప్పుడు సభ్యులు తమ వద్ద ఉన్న పిటిషన్లను ఆయనకు అందజేస్తారు. అప్పుడు స్పీకర్ వాటిని పిటిషన్ కమిటీకి అందజేస్తారు. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్ అందజేసి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని కోరడం అసెంబ్లీ రూల్స్‌లోని 167 పరిదిలోకి రాదంటున్నారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ విధంగా కోరాలనుకుంటే దానికి మరో మార్గం ఉందంటు్ననారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ప్రతి శుక్రవారం సభ్యులకు అనధికార తీర్మానంఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్ పార్టీ ఇచ్చిన పిటిషన్‌ను సభాపతి పరిశీలన నిమిత్తం కమిటీ చైర్మన్‌గా ఉండే డిప్యూటీ స్పీకర్‌కు పంపిస్తారు.

English summary

 YSR Congress Party MLAs gave a petition to speaker Nadendla Manohar on Saturday for resolution on United Andhra Preadesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X