5గురు గర్ల్స్ ఒడిలో పడుకొని విద్యార్థి ఫోటో: వివాదం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ విద్యార్థి క్లాసులోని అమ్మాయిల ఒడిలో పడుకొని ఓ పొటో తీయించుకున్నాడు. అది ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా పాకిపోవడంతో.. పలువురు దీని పైన మండిపడుతున్నారు. హిందూ సంస్థలు కొన్ని కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి.
ఈ క్రమంలో అమ్మాయిల ఒడిలో పడుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతనిని చితకబాది వదిలేశారు. ఆ ఫోటోను తన మిత్రులు సరదాగా తీశారని అతను చెబుతున్నాడు. కాగా, విద్యార్థితో పాటు అతను ఎవరి ఒడిలో పడుకున్నాడో.. ఆ విద్యార్థినీలను కళాశాల సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటో ఓ అమ్మాయి ఫేస్‌బుక్ అకౌంట్ నుండి బయటకు వచ్చింది. దీని పైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పదమైన ఆ ఫోటోను తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి అప్ లోడ్ చేశారని ఆరోపించారు.
ఈ ఫోటోను తన క్లాస్‌మేట్ ఒకరు ఫిబ్రవరి 18వ తేదీన తీశారని, అనంతరం ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారని చెప్పారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి దానిని అప్ లోడ్ చేశారని ఫిర్యాదు చేశారు. సురత్కాల్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని, కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications