చెన్నై యువతి సృష్టి: ముట్టుకుంటే ‘షాక్’ కొట్టే ‘బ్రా’
చెన్నై: మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను అడ్డుకునేందుకు ఒక రక్షణ కవచాన్ని కనిపెట్టింది తమిళనాడులోని చెన్నైకు చెందిన యువతి మనీషా మోహన్.
అమెరికాలో మిట్ మీడియా ల్యాబ్‌లో చదువుతున్న మనీషా మోహన్.. మహిళలు ధరించే ‘బ్రా'నే వారికి సహాయపడేలా రక్షణ కవచంగా తయారు చేసింది. ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన వారికి 3,800 కిలోవాట్ల విద్యుత్ షాక్ కొడుతుంది.
అంతేకాదు.. ఇందులో అమర్చిన జీపీఎస్ సహాయంతో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ఒక సందేశం పంపే వ్యవస్థ కూడా ఉంది. ఇటీవలే ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు దీని పనితీరును ప్రదర్శించి ఆయన ప్రశంసలు కూడా పొందింది మనీషా.

వర్సిటీ అందించిన చేయూతతో స్వీడన్‌లో సెమిస్టర్ అభ్యసించే అవకాశం కలిగిందని, అలా వెళ్లడమే సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందని మనీషా తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది మనిషా.
కాగా, ఈ బ్రా రూపొందించినందుకు గాను గాంధీయన్ యంగ్ టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ అవార్డు కూడా వచ్చింది. కాగా, ఈ షాక్ బ్రాను మరింత చిన్న పరికరాలతో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనీషా బృందం కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications