ఇలా థ్యాంక్స్: పవన్ కళ్యాణ్ నగర్ వెలిసింది

గుంటూరు: ఎన్టీఆర్ నగర్, ఇందిరా నగర్ వంటివి చూశాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నగర్ కూడా కళ్ల ముందుకు వచ్చింది. రాజధానికి భూసేకరణ నుంచి తప్చించినందుకు తమ కాలనీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకుని కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. రాజధాని నిర్మాణాలకు భూ సేకరణ ద్వారా భూములివ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్ స్పందించి అడ్డుకున్నారు.

దాంతో వారు తమ కాలనీకి పవన్ కళ్యాణ్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామ రైతులు తొలి నుంచీ భూ సేకరణ, భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. గ్రామంలోని రైతులు పూల సేద్యం ద్వారా లాభాలు గడిస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వం హైవే నిర్మాణం పేరుతో వందల ఎకరాల భూమిని తీసుకుంది.

Colony is named after power star Pawan Kalyan

దానికి తోడు, అమరావతి టౌన్‌షిప్ పేరుతో 400 ఎకరాల భూమిని దశాబ్దాల క్రితమే సేకరించి నిరుపయోగంగా వదిలేసింది. మరలా భూములు ఇవ్వమంటే ఉన్నకొద్దిపాటి భూమి కూడా ఎలా ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్థాపించిన పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటువేశారు.

అయితే తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణాల పేరుతో భూములు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రైతు వాసా మల్లిఖార్జునరావు తెలిపారు. బలవంతంగా భూములు సేకరించాలని నోటిఫికేషన్ జారీచేయడాన్ని గుర్తించిన పవన్‌ కళ్యాణ్ తక్షణమే స్పందించి ప్రభుత్వం ముందుకు వెళ్తే ఆందోళనచేస్తానని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరికలతో ప్రభుత్వం భూ సేకరణను నిలిపివేసిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.

తమ భూములను కాపాడిన పవన్‌కల్యాణ్ పేరుమీద చెరువుగట్టు ప్రాంతానికి పవన్‌ కళ్యాణ్ నగర్‌గా నామకరణం చేసినట్లు రైతులు చెప్పారు ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ నగర్‌లో దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలామ్ విగ్రహాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+