గోపాల గోపాల సినిమాపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: సినిమాలకు ఫిర్యాదుల బెడద తప్పడం లేదు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ గోపాల గోపాల సినిమాపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రఘునాథరావు అనే వ్యక్తి ఆ సినిమాపై హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందంటూ ఆతను తన ఫిర్యాదులో అన్నాడు.
కాగా, గోపాల గోపాల సినిమా శనివారండు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై మంచి టాక్ కూడా వచ్చింది. హిందీలో ఓహ్, మై గాడ్ సినిమాకు ఇది రిమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఉన్న క్రేజ్ కూడా సినిమాకు అనుకూలంగా పనిచేసిందని అంటున్నారు.

సినిమా ముఖ్యంగా దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలతో ప్రేక్షకులను ఆలోచనలో పడేసే దిశగా ప్రయత్నించారు. అయితే సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చుట్టూ కథ తిరగటం, సెకండాఫ్ లో ఎక్కువ భాగం కోర్టు సీన్స్, మెలోడ్రామా, మెసేజ్, తో నింపటం జరిగింది.
అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఓ ప్రయోగంగా చూస్తే బాగుందనిపించే ఈ చిత్రం కమర్షియల్ గా భాక్సాఫీస్ వద్ద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. అవన్నీ ప్రక్కన పెడితే పవన్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో... వాటిని ప్రక్కన పెట్టి మెసేజ్ తో కూడిన చిత్రం కావడం విశేషం.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications