పూరీ జగన్నాథ్ చెంప పగులగొడతా: దేశపతి
మెదక్: సినిమాల ద్వారా సమాజానికి చెడు సందేశాలు ఇస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ముందుకు వస్తే అతని చెంప పగులగొడుతానని ప్రముఖ గాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) దేశపతి శ్రీనివాస్ అన్నారు.

మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఓ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నాడు తెలంగాణ పునర్నిర్మాణం - అభివృద్ధి అనే అంశం పైన సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌లో దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై సంచలన వ్యాఖ్యలను చేశారు.
సమాజాన్ని ఉద్ధరించాలని సినిమాలు తీస్తే చంక నాకిపోతాయని మాట్లాడారని, అలాంటి మాటలు మాట్లాడినందుకు పూరీ జగన్నాథ్ చెంప చెళ్లుమనిపించాలన్నారు. స్త్రీలను, ఉపాధ్యాయులను, తండ్రులను అవమానపరుస్తూ బలాదూర్ కల్చర్‌ను సీమాంధ్రకు చెందిన కొందరు దర్శకులు ముందుకు తెస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications