టిడిపి వ్యాఖ్యలపై మనస్తాపం: గవర్నర్ రాజీనామా?
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పిలుపు రావడంతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆఘమేఘాల మీద గురువారం సాయంత్రం ఢిల్లీ విమానం ఎక్కేశారు. అనుకోకుండా అదే విమానంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ కూడా ఉన్నారు.
ఓటుకు నోటు కేసును పర్యవేక్షించాలని భారత అటార్నీ జనరల్ ముకుల్ రహ్తోగీ సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, గవర్నర్‌కు అటువంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ చెప్పారు. దీంతో ఆ వివాదం ముగిసినప్పటికీ గవర్నర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.

టిడిపి మాటల దాడికి మనస్తాపానికి గురైన గవర్నర్ తన పదవికి రాజీనామా చేస్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆయన స్తానంలో గవర్నర్‌గా నజ్మా హెప్తుల్లా గవర్నర్‌గా రావచ్చునని కూడా ప్రచారం సాగింది. అయితే, రాజభవన్ వర్గాలు మాత్రం ఆ పుకార్లను కొట్టి పారేస్తున్నాయి.
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌ను అధికార టిఆర్ఎస్‌తో పాటు తెలంగాణకు చెందిన మజ్లీస్, బిజెపి, కాంగ్రెసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, గవర్నర్ పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications