దుమారం: ‘దేశం విడిచి వెళ్లిపోదామన్న’ అమీర్ ఖాన్
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ నిరసన చేపడుతున్న మేధావులకు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ మద్దతు పలికారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు అసహనంపై వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు అమీర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆందోళనకు గురైనట్లు ఆయన చెప్పారు. తన భార్య కిరణ్ రావ్.. దేశం వదిలివెళ్లిపోదామని సూచించినట్లు ఆయన వెల్లడించారు. అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్న ప్రముఖులను ఆయన వెనకేసుకొచ్చారు.
అసమ్మతి, అసంతృప్తిని బయటపెట్టేందుకు సృజనశీలులకు ఇదొక మార్గమని వ్యాఖ్యానించారు.ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయెంకా ఎక్సెలెన్స్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి జైట్లీ కూడా హాజరయ్యారు.

‘రోజూ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో పత్రికలు చూస్తుంటే తెలుస్తోంది. ఓ వ్యక్తిగా, దేశ పౌరుడిగా నాకు ఆందోళన కలుగుతోంది. చాలా సంఘటనలు నన్ను కలవరపాటుకు గురిచేశాయి'అని అమీర్ ఖాన్ చెప్పారు.
కాగా, అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోందన్న అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నటుడు, ఢిల్లీ బిజెపి ఎంపి మనోజ్ తివారీ సోషల్ మీడియాలో స్పందించారు. అమీర్‌కు ఎక్కడ శాంతి ఉంటుందనుకుంటే అక్కడి వెళ్లిపోవచ్చని, ఆ స్వతంత్రత ఆయనకుందంటూ ట్వీట్ చేశారు.
Aamir khan ne apne bayaan se desh ka mahaul bigaadne ki koshish ki. Hall me baithe saikdon logo ne bhartiya sehanshilta ka parichay diya...
— Manoj Tiwari (@ManojTiwariMP) November 23, 2015 ఇక్కడ జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఒక్క క్షణంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి భారతమాతకు తీరని కళంకాన్ని ఆపాదించారని మనోజ్ తివారీ మండిపడ్డారు. ఎంత పొరబాటుగా మాట్లాడారో ఇప్పటికైనా ఆలోచించాలని అమీర్‌కు ఆయన సూచన చేశారు.
అమీర్ ప్రకటన షాక్‌కు గురి చేసిందని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. అయినా తనలాంటి అభిమానులు అమీర్ పై కురిపించిన ప్రేమ,ఆప్యాయతలు ఇక ముందు కూడా కొనసాగాలంటూ మనోజ్ తివారీ ఆకాంక్షించారు.

కాగా, బాలీవుడ్ నటులు, బిజెపి నేతలైన పరేశ్ రావల్, అనుపంఖర్‌లు కూడా అమీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నిన్ను అమీర్ ఖాన్‌ను చేసిన ఈ దేశంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం' అని అనుపంఖేర్ అన్నారు. ఇంక్రిడబుల్ ఇండియా ఆరు నెలల్లోనే ఇంటోలరెన్స్ ఇండియా అయిపోయిందా? అని ప్రశ్నించారు.
దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులు వారి సంప్రదాయాలను, పండగలను, వ్రతాలను ఆచరించాలని మీపైనా బలవంతంగా ఏమైనా రుద్దుతున్నారా? అని నిలదీశారు. మీరొక్కరే వెళ్లిపోతారా? మిగితా 2మిలియన్ల మంది భారతీయులకు ఏం సూచిస్తారని ప్రశ్నించారు. అమీర్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం, దేశంలో మార్పు వచ్చేలా చూడాలని పరేశ్ రావల్ కోరారు.
Aamir is a fighter so he should not leave but change the situation in the country ! jeena yahan marna yahan !
— Paresh Rawal (@SirPareshRawal) November 23, 2015 A true patriot will not run away n leave his motherland behind in turmoil or in troubled times (if any )...don't escape - build it ..
— Paresh Rawal (@SirPareshRawal) November 23, 2015 If I believe this is my motherland then I will never talk about leaving it ....but I would if I had believed otherwise ...
— Paresh Rawal (@SirPareshRawal) November 23, 2015 -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications