హృతిక్‌తో అనుష్కచిందు, వచ్చి వెళ్లిన కోహ్లీ(పిక్చర్స్)

కోల్‌కతా: తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క నృత్య ప్రదర్శన మొదలు కాగానే వీవీఐపీ గ్యాలరీలో ప్రత్యక్షమైన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆమె ప్రదర్శన పూర్తవగానే జారుకోవడం గమనార్హం. అనుష్క శర్మ ప్రదర్శన ఉన్నంత సేపు కోహ్లీ ఆనందించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8 ప్రారంభోత్సవం కోల్‌కతాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ ప్రదర్సన ఇచ్చారు. అనుష్క ప్రదర్శన సమయంలో టీవీ కెమెరాలు అన్నీ కోహ్లీ వైపుకే మళ్లాయని చెప్పవచ్చు. తన పాపురల్ సినిమా పాటలకు అనుగుణంగా ఆమె డ్యాన్స్ చేస్తుంటే కోహ్లీ మురిసిపోయాడు.

IPL 8: Virat Kohli smiles as girlfriend Anushka Sharma performs

కాగా, ఐపీఎల్‌-8 అట్టహాసంగా ఆరంభమైంది. హృతిక్‌ రోషన్‌ డాన్స్‌లతో, అనుష్క శర్మ అందాలతో, షాహిద్‌ కపూర్‌ చిందులతో, ఫరాన్‌ అక్తర్‌ పాట కచేరితో కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియం హోరెత్తింది. విద్యుత్‌దీపాల వెలుగుల మధ్య ప్రారంభ వేడుక మంగళవారం కన్నుల పండుగగా జరిగింది.

ముందుగా ఎనిమిది జట్ల కెప్టెన్లు వేదికపై చేరి సంతకాలు చేశారు. ట్రోఫీ ముందు ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం షాహిద్‌ కపూర్‌ డాన్స్‌తో కార్యక్రమానికి ఊపు తెచ్చాడు. తర్వాత అనుష్క తన అంద చందాలతో ఉర్రూతలూగించింది.

IPL 8: Virat Kohli smiles as girlfriend Anushka Sharma performs

ఇక బాలీవుడ్‌ హీరో, దర్శకుడు, సింగర్‌ ఫర్హాన్‌ అక్తర్‌ తన ఆటాపాటాతో స్టేడియాన్ని హోరెత్తించాడు. చివరిగా స్టయిలిష్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కళ్లు చెదిరే ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. తన తొలి సినిమా కహోనా ప్యార్‌ హైతో మొదలెట్టి ధూమ్‌ మచాలే పాటలకు డాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించాడు.

ఈ కార్యక్రమానికి హీరో సైఫ్‌ అలీఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. హృతిక్‌ డాన్స్‌ అనంతరం సైఫ్‌ మాట్లాడుతూ ఐపీఎల్‌-8 ప్రారంభమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. వర్షం కారణంగా ప్రారంభ వేడుకలు రెండు గంటలు ఆల స్యంగా మొదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 7 గంటలకే ఆరంభం కావాల్సి ఉంది. దీంతో వేడుకలను కుదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+