విద్యుత్ మంత్రికి పవర్ షాక్, కెసిఆర్‌కు కోపమొస్తోంది!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కూడా విద్యుత్ కోత కష్టాలు తప్పలేదు! మరో మూడేళ్లలో తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ చెబుతోన్న విషయం తెలిసిందే.

అయితే, సచివాలయంలో మాత్రం అరుదుగా, ఎప్పుడూ జరగని సంఘటన జగదీశ్వర్ రెడ్డికి ఎదురైంది. ఇటీవల జగదీశ్వర్ రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో కొన్ని నిమిషాల పాటు విద్యుత్ కట్ అయింది.

Jagadeeeswar Reddy too goes powerless

దీని పైన జోకులు పేలుతున్నాయి. మరోసారి జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా విద్యుత్ కోత అతనిని ఇబ్బంది పెట్టింది. దీంతో, జగదీశ్వర్ రెడ్డి తన శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోసారి ఇలాంటిది జరగవద్దని చెప్పారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ సిఎం కెసిఆర్ ఇటీవల ఒకటి రెండుసార్లు సభలో సామాన్యుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ప్రాజెక్టుల గురించి కెసిఆర్‌ను ప్రశ్నించారు. దీనిపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నా కన్నా నీకు ఎక్కువ తెలుసా, చెప్పింది వినాలని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+