రేవంత్ నోట 15 సార్లు బాబు పేరు: గన్‌మెన్ సాక్షులు
హైదరాబాద్: డీల్ కుదుర్చుకోవడానికి తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో రేవంత్ రెడ్డి జరిపిన సంభాషణల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు 15 సార్లు వచ్చినట్లు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కేసులో రేవంత్ రెడ్డి గన్‌మెన్, డ్రైవర్ కీలక సాక్షులు కానున్నట్లు భావిస్తున్నారు.
ఏ సమయంలో రేవంత్ రెడ్డి తమను వదిలేసి పోయారో ఆయన గన్‌మెన్ ఎసిబి అధికారులకు చెప్పారు. ఆ సమయంలో ఆయన స్టీఫెన్‌సన్‌తో ఉన్నట్లు వారు గుర్తించారు. రేవంత్ రెడ్డి సెల్‌ఫోన్ టవర్ లోకేష్ ఆ విషయాన్ని పట్టిచ్చినట్లు చెబుతున్నారు. స్టీఫెన్ సన్ మిత్రుడితో రేవంత్ రెడ్డి ఉన్న విషయాన్ని కూడా దాని ద్వారా ఎసిబి అధికారులు గుర్తించారని అంటున్నారు.
నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి గన్‌మెన్, డ్రైవర్ కీలక సాక్షులు కానున్నారు. మెజిస్ట్రేట్ ముందు వారి వాంగ్మూలాలను ఎసిబి అధికారులు రికార్డు చేయడానికి సమాయత్తమవుతున్నారు. రేవంత్ రెడ్డి టేప్స్‌లో చంద్రబాబు నాయుడి పేరు 15 సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు కూడా వారు గుర్తించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి ముగ్గురు శాసనసభ్యుల మద్దతు సంపాదించాలని అనుకున్నప్పటికీ టిఆర్ఎస్‌ను చిక్కుల్లో పడేయడానికి ఇంకా ఎక్కువ మంది శాసనసభ్యులను ట్రాప్ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది.
ఎసిబి అధికారులు 20 మంది కాల్ డేటాను పరిశీలించారు. వారిలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఈ ఫోన్ల నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్లు వెళ్లినట్లు గుర్తించారని అంటున్నారు. ఇల్లందు శాసనసభ్యుడు కె. కనకయ్యను పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. తనకు కూడా టిడిపి నేతలు ఫోన్ చేశారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications