వివాదాస్పదమవుతున్న ప్రధాని మోడీ ‘ఆటోగ్రాఫ్’
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వబోతున్న కానుకపై వివాదం చెలరేగుతోంది. భారత జాతీయ పతాకంపై మోడీ సంతకం చేసి దాన్ని ఒబామాకు బహుమతిగా ఇవ్వనున్నారు.
ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదుగా అమెరికా అధ్యక్షుడికి సోమవారం దాన్ని కానుకగా ఇవ్వనున్నారు. అమెరికా పర్యటలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలకు ఎగ్జిక్యూటీవ్‌లకు విందు ఇచ్చారు.
ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా రకరకాల వంటకాలు చేసి అతిధులకు వడ్డించారు. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకంపై ప్రధాని మోడీ ఆటోగ్రాఫ్ చేశారు. దీన్ని సోమవారం వికాస్‌ఖన్నా ఒబాకు అందించనున్నారు.

కాగా, ఇది సోషల్ మీడియాలో వివాదం రేపుతోంది. నియమ, నిబంధనల ప్రకారం జాతీయ పతాకంపై సంతం చేయరాదని, ప్రధాని స్థాయిలో ఉండి మోడీ ఇలాంటి పని చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇది ముమ్మాటికీ జాతీయ పతాకాన్ని అగౌరపరచడమేనని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రధాని మోడీ చర్యను తప్పుపట్టారు. అయితే మోడీ జాతీయ పతాకంపై సంతకం చేయలేదని, అది జాతీయ పతాకం కాదని బిజెపి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications