వరదలు: మోడీయే కాదు, మన్మోహన్ ఫోటో మార్ఫింగ్
న్యూఢిల్లీ: తమిళనాడు రాజధాని చెన్నైలో వరదల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల క్రితం విహంగ వీక్షణం చేశారు. ఈ సందర్భంగా ఫోటోషాప్‌లో మార్ఫింగా చేసిన ఏరియల్ సర్వే ఫోటో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
దీని పైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) స్పందించింది కూడా. చెన్నైలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చాపర్‌లో కూర్చుని బయటి దృశ్యాలను పరిశీలిస్తున్న ఉన్న ఓ చిత్రాన్ని పిఐబి విడుదల చేసింది. ఈ ఫోటోలో బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే, ఈ ఫొటో ఒకటి అయితే, దానిలో అద్దం ఉన్న ప్రాంతంలో మరో వరద చిత్రాన్ని జోడించి, మార్ఫింగ్ చేసి బాగా కనిపిస్తుందనే ఉద్దేశంతో పిఐబి ఫోటోషాప్‌లో మార్పులు చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పశ్చాత్తాపం ప్రకటించింది.
అయితే, ఇలా పీఐబీ ఇలా చేయడం ఇదే మొదటిసారి మాత్రమే కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఇలాగే చేసింది. ఆ ఫొటోలు ఇప్పటికీ ఫోటోడివిజన్ వెబ్‌సైట్లో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను ఒకే చిత్రంలో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశామని, ఇటువంటి చిత్రాలు చాలానే ఉన్నాయని పీఐబీ అధికారి ఒకరు తెలిపారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications