వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కనీసం భార్య మాటలనైనా వినండి ఫడ్నవీస్!’

|
Google Oneindia TeluguNews

ముంబై: కనీసం భార్య మాటనైనా విని పెరిగిన ధరలను అదుపులోకి తీసుకురావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇటీవల ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. పేదల జేబులకు చిల్లులు పడేలా ఆకాశానికి ఎగిసిన వంట సరుకులు, పప్పు దినుసుల ధరలను నియంత్రించాలని కోరింది.

అంతేగాక, ‘తమ జీవితాల్లో మార్పు కోసం ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు. కనీసం వారు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే వెసులుబాటైనా ప్రభుత్వం కల్పించాలి' అని ఆకాశన్నంటిన ధరలపై సీఎం భార్య అమృతా ఫడ్నవిస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వ మిత్రపక్షమైన శివసేన పైవిధంగా స్పందించింది.అందుకు ఆమెకు కృతజ్ఞతలు. కనీసం భార్య మాటలనైనా సీఎం ఫడ్నవిస్ పరిగణనలోకి తీసుకోవాలని అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన విమర్శించింది.

Pulses price rise: Fadnavis should listen to his wife, quips Shiv Sena

బ్లాక్ మార్కెట్ చేసేవారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని, సీజ్ చేసిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల పప్పు నిరుపయోగంగా గోడౌన్లలో పడివుందని శివసేన పేర్కొంది. ‘రూ.
100కు కిలో పప్పును అందజేస్తామని ప్రకటించింది. ప్రజలు వాటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు రూ. 100కే కిలో పప్పు దినుసులు అందిస్తే ఆ క్రెడిట్ బిజెపి ముఖ్యమంత్రికే దక్కుతుంది.' శివసేన వ్యాఖ్యానించింది.

పప్పు దినుసులు పుచ్చిపోకముందే.. సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేకపోతే పోషకాహార లోపం, ఆకలితో మరణించిన పిల్లలు, ఆదివాసీల బిడ్డల స్మారకం కోసం ఉపయోగిస్తారా? అంటూ తీవ్రంగా మండిపడింది.

English summary
In a sarcastic comment over soaring prices of pulses and other kitchen staples, the Shiv Sena on Friday advised Maharashtra Chief Minister Devendra Fadnavis to listen to his wife and bring the rates under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X