ఊగిసలాట: తోటి ఖైదీలకు రేవంత్ వస్తువులు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న తెలుగుదేశం తెలంగాణ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆశానిరాశల మధ్య ఊగిసలాడారు. బెయిల్ లభించిన ఆనందం ఓ వైపు ఉండగా, సాయంత్రం వరకు జైలు నుంచి బయటకు రావడానికి అవసరమైన లాంఛనాలు పూర్తి కాకపోవడం మరో వైపు నిరాశను కలిగించింది.
గత నెల రోజులుగా రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇంతకాలం అక్కడ తాను వినియోగించిన వస్తువులన్నిటినీ అక్కడి తోటి ఖైదీలకు ఇచ్చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి వినియోగించిన వస్తువులను తమకు ఇవ్వాలని ఖైదీలు కోరారు.

దాంతో తాను వాడిన దిండ్లు, దుప్పట్లు, దుస్తులు, బూట్లువంటి వాటినన్నింటినీ ఆయన అడిగినవారికి అడిగినట్లు ఇచ్చేశారు. అయితే, మంగళవారం రాత్రి కూడా ఆయన అక్కడే ఉండాల్సి ఉందని తెలిసిన తర్వాత వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చారని తెలుస్తోంది.
సాయంత్రం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. రాత్రంతా ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications