జంప్స్: టిటీడిపి నేతలకు లోకేష్ చిట్కాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన పార్టీ శాసనసభ్యుడు సాయన్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లోకి జంప్ చేయడం, మరో ఎమ్మెల్యే కూడా జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతుండడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ పార్టీ నాయకులకు చిట్కాలు చెప్పారు.
టిఆర్ఎస్ చర్యలను ఎప్పటికప్పుడు ప్రతిఘటించాలని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించడానికి టిఆర్ఎస్ అన్ని ఎత్తులూ వేస్తుందనే విషయాన్ని ముందే పసి గట్టి అందుకు తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని కూడా ఆయన అన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగి పోయి ఉన్నారని చినబాబుగారూ ఓ అంచనాకు వచ్చారు. దాంతో వచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లోటిడిపి, బిజెపి కూటమికి మంచి అవకాశాలున్నాయని కూడా ఆయన టిడిపి నేతలకు చెప్పారు.
విస్తరించే అవకాశాలను వదులుకోకూడదని ఆయన టిటీడిపి నాయకులకు చెప్పారు. జిహెఎంసిలోని అన్ని డివిజన్లలో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. పార్టీలు మారిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించాలని కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద, టిడిపికి తెలంగాణలో షాక్ మీద షాక్ తగులుతోంది. ఈ స్థితిలో లోకేష్ బాబుగారు పార్టీని పట్టాలపై పెట్టగలరా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications