థరూర్ లీక్: సోనియా అగ్గి మీద గుగ్గిలం

న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్‌పై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒంటి కాలిమీద లేచారు. శాంత స్వభావిగా పేరున్న సోనియా ఒక్కసారిగా నీవెప్పుడూ ఇలాగే చేస్తావంటూ అగ్గి మీద గుగ్దిలమయ్యారు. దీంతో మిగతా ఎంపీలంతా అవాక్కయ్యారు.

మంగళవారం పార్టీ ఎంపీలతో సోనియా నిర్వహించిన సమావేశంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేవరకూ పార్లమెంట్‌ను అడ్డుకోవాలని పార్టీ వ్యూహం రచించింది. శశిథరూర్ దానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సోనియా సీరియస్ అయినట్లు తెలిసింది.

Sonia Gandhi pulls up Shashi Tharoor for leaking party details

విషయం బయటకు పొక్కడంతో.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తుండటంతోనే సోనియా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. దానికి తోడు శశిథరూర్ పార్టీ వ్య.వహారాలను లీక్ చేస్తున్నారని ఆమెకు సమాచారం ఉందట. దాంతో ఆమె కోపం శశి థరూర్‌పై నశాలానికి ఎక్కింది.

సమావేశం వివరాలను లీక్ చేయడం నీకు బాగా అలవాటైంది, దాన్ని ఆపేయ్ అంటూ ఆమె హెచ్చరించారు. వ్యాపం కుంభకోణంపై, లలిత్ గేట్‌పై పార్లమెంటు సమావేశాలను స్తంభించజేయాలనే పార్టీ నిర్ణయంపై థరూర్ అవతలి పక్షానికి ఉప్పు అందించారని సోనియా కనిపెట్టి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+