వరల్డ్ కప్: భారత్‌ను నమ్ముకొని రూ.700 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను వంద కోట్ల మందికి పైగా చూస్తారు. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు గెలుస్తుందని నమ్ముకొని స్పాన్సర్లు రూ.700 ఖర్చు చేస్తున్నారట. ఇప్పటి వరకు ప్రపంచకప్ మ్యాచులలో భారత్ పైన పాకిస్తాన్ గెలవలేదు.
ఈ నేపథ్యంలో మరోసారి భారత్ గెలుస్తుందని స్పాన్సర్లు భారీ మొత్తంలో స్పాన్సర్‌షిప్‌కు ముందుకు వచ్చారట. రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారని మార్కెట్ వర్గాల అంచనాగా తెలుస్తోంది. ప్రముఖ భారత వాణిజ్య సంస్థలు వాటి ఉత్పత్తుల ప్రచారం కోసం... పది సెకన్ల ప్రకటనకు నాలుగున్నర నుండి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తున్నాయంట.

ఎయిర్ టెల్, మారుతీ సుజికీ, హీరో, వొడాఫోన్, అమూల్, ఫెడెక్స్, ఫెవిక్విక్, రెమాండ్ తదితర ఎన్నో కంపెనీలు ప్రపంచకప్ సందర్భంగా స్పాన్సర్ షిప్‌కు ముందుకు వచ్చాయి.
కాగా భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వంద కోట్ల మందికి పైగా వీక్షిస్తారు. 2011లో భారత్ - పాక్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను దాదాపు వంద కోట్ల మంది వీక్షించారు. ఇప్పుడు అది మరింత పెరుగుతుంది.












Click it and Unblock the Notifications