చరిత్ర రిపీట్ అవుద్ది! బాబుకు టీజీ వెంకటేష్ హెచ్చరిక
విశాఖ: మాజీ మంత్రి, కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విశాఖలో ఆదివారం మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలుగానే చెప్పవచ్చు.

అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్నే అభివృద్ధి చేశారని, ఆర్థిక రాజధానిగా హైదరాబాద్ అవంతరించిన తర్వాత సీమాంధ్రులను గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు కూడా వెనుకబడిన జిల్లాలను విస్మరించవద్దన్నారు. రాజధాని ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే చరిత్ర పునరావృతం అవుతుందని హెచ్చరించారు. నాడు పాలకులు చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేయవద్దని హితవు పలికారు.

అభివృద్ధి అంతా ఒకేచోట కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు విస్తరించాలని కోరారు. కాగా, రాయలసీమ అభివృద్ధి పైన దృష్టి సారించకుంటే ప్రత్యేక సీమ వాదన తెరపైకి వస్తుందనే ఊహాగానాలు ఎప్పటి నుండో వస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications