సిరిసేన కోసం తిరుమల తాళం పగులగొట్టారు
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు మైత్రిపాల సిరిసేన తన భార్యతో కలిసి రావడానికి కొద్ది సేపటి ముందు స్వర్ణద్వారం తలుపులు తెరుచుకోలేదు. అవి ఇరికిపోవడంతో తెరవడం కష్టసాధ్యమైంది.

వివిఐపి దర్శనం నేపథ్యంలో చేసేది లేక అధికారులు రంపంతో తాళాన్ని కోసేసి ద్వారం తెరిచారు. దాంతో సిరిసేన ఏ విధమైన ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోగలిగారు. బుధవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. పాత తాళం స్థానంలో కొత్త తాళాన్ని తెచ్చి పెట్టారు. దీంతో భక్తులకు కూడా ఏ విధమైన ఇబ్బంది కలగలేదు.
తెల్లవారు జామున గం.2.15 నిమిషాలకు ఆలయ అర్చకులు వచ్చి బంగారు వాకిలి తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. సుప్రభాత సేవ చేయడానికి అవసరమైన తలుపులు తెరుచుకోలేదు. 3 గంటలకు సుప్రభాత సేవ చేయాల్సి ఉండగా అర్చకులు 45 నిమిషాల ముందే వచ్చారు. అప్పుడు బంగారు వాకిలి తెరిచి, ఆవరణను శుభ్రం చేస్తారు. బంగారు వాకిలిని తెరవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఒకేసారి మూడు తాళం చెవులు ఉపయోగించాల్సి ఉంటుంది.

మొదటి తాళం చెవి ఇరుక్కుపోయి తాళం తెరుచుకోలేదు. దీంతో దాన్ని పగుల గొట్టారు అప్పటికే సిరిసేన తన భార్య పుష్పకుమారితో బయట సుప్రభాత సేవకోసం నిరీక్షిస్తున్నారు. వైకుంఠ కాంప్లెక్స్‌కు వెళ్లడానికి ముందు ఆ దంపతులు మహాద్వారం వద్ద నించున్నారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications