కాబోయే సిఎంగా స్లోగన్స్: ఒడుపుగా కుష్బూ?
చెన్నై: ఒక్కసారిగా సినీ నటి కుష్బూ తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైన నాయకురాలు అయిపోయారు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు. అధికార ప్రతినిధిగా ప్రకటించిన వెంటనే ఆమెపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇంతకు ముందు పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ఈవికెస్ఎస్ ఇలంగోవన్ కుష్బూను కాబోయే మంత్రిగా అభివర్ణించారు.
తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా స్థానిక నేతలు కాబోయే సిఎం కుష్బూ అంటూ నినాదాలు చేశారు. భూసేకర చట్టానికి వ్యతిరేకంగా, ఆ చట్టానికి మద్దతు ఇస్తున్న అన్నాడియంకె ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సోమవారం సాయంత్రం అన్నా విగ్రహం వద్ద కాంగ్రెసు సభ జరిగింది. ఈ నిరసనకు కుష్బూ నాయకత్వం వహించారు.

ఆ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా నాయకులు ఆరోగ్య రాజ్, వేలు స్వామి తదితరులు కుష్బును పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మద్దతుదారులు రెచ్చిపోయారు. చిదంబరానికి మద్దతుగా వారు నినాదాలు చేశారు. మరి కొందర ఇళంగోవన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళం చెలరేగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది.
కేంద్రంపై వాగ్బాణాలు విసురుతూ కుష్బూ ప్రసంగం సాగించారు. ఆమె కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సమయంలో కాబయోే సిఎం అంటూ నినాదాలు మార్మోగాయి. తర్వాత ఆ విషయంపై మీడియా కుష్పూను కదిలించింది. కాంగ్రెసు పార్టీలో ఎవి అభిప్రాలు వారు చెప్పుకునేందుకు అవకాశం ఉందని, ఎవరికి వారు తమ అభిప్రాయాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారని, వాటన్నంటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె ఒడుపుగా తప్పించుకున్నారు.












Click it and Unblock the Notifications