విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణను అవమానించిన చంద్రబాబు?

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణను అవమానించారా అంటే మీడియా వార్తాకథనాలను బట్టి అవుననే అనిపిస్తోంది.
విజయవాడలో అత్యంత ప్రతిష్ఠాత్మక కనకదుర్గగుడి ఈవో నియామకం విషయంలో బాలకృష్ణకు అవమానమే మిగిలిందని అంటున్నారు.

బాలకృష్ణ సూచించిన వారి కి కాకుండా, వేరే వారికి చంద్రబాబు ఆ పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. తాను సిఫారసు చేసిన తర్వాత కూడా ఐఏఎస్‌ను నియమించడం పట్ల బాలకృష్ణ మనస్తాపానికి గురైనట్లు వినికిడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న ఆలయం విజయవాడ కనకదుర్గ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవహారంలో చంద్రబాబు బాలకృష్ణ సిఫారసును బేఖాతరు చేసినట్లు చెబుతున్నారు.

 Chandrababu ignores Balakrishna's recommandation

జాయింట్ కమిషనర్ స్థాయిలో పనిచేస్తూ, తనకు కావలసిన ఒక అధికారికి కనకదుర్గ గుడి ఈఓగా పోస్టింగు ఇవ్వాలని బాలకృష్ణ ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. అయితే, సీసీఎల్‌ఏలో పనిచేసిన ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని చంద్రబాబు నియమించారు. విభజన తర్వాత దేవాలయ ప్రాధాన్యం పెరుగుతున్నందున తిరుమలకు మాదిరిగానే కనకదుర్గ దేవాలయానికీ ఐఏఎస్ అధికారినే నియమించాలని పార్టీ వర్గాలు సూచించాయని, దాంతో చంద్రబాబు అందుకు ఆమోదించినట్లు అంటున్నారు.

ప్రస్తుతం నాన్-ఐఏఎస్ అధికారి మాత్రమే దుర్గ గుడి ఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఐఏఎస్‌లే ఈఓగా ఉండే విధానానికి శ్రీకారం చుట్టడం ద్వారా, చంద్రబాబు తన వియ్యంకుడికి విధానాన్ని సాకుగా చూపించినట్లు తెలుస్తోంది. అయితే, తాను చెప్పిన తర్వాత కూడా తాను సూచించిన వారిని కాదని, ఏఏఎస్‌ను నియమించడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Andhra Pradesh CM Nara Chandrababu Naidu has ignored Hindupur Telugu Desam Party MLA Nandamuri Balakrishna's recommandation regarding Kanakadurga temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X