తిరుమల నిత్యాన్నదాన క్యాంటిన్‌లో సాంబారులో పడ్డ ఉద్యోగి

అమరావతి: తిరమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన క్యాంటిన్‌లో శనివారం విషాదం చోటు చేసుకుంది. హరినాథరాయుడు అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ వేడి వేడి సాంబారు గంగాళంలో పడిపోయాడు.

దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఇతర ఉద్యోగులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హుటాహుటిన అశ్వని ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స చేయించారు.

హరినాథ్ శరీరమంతా కాలిన గాయలై పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 శాతం వరకు శరీరం కాలిపోయింది. ఈ ఘటన శనివారం తిరుమలలో కలకలం సృష్టించింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు పెనుప్రమాదం ఏమీ లేదని తేల్చిచెప్పారు.

Employee injured at venkateswara annaprasadam trust bhavan

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న తిరుపతి పోలీసులు ఘటనపై సహచర ఉద్యోగులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నిత్యం కొన్ని వేల మందికి అన్నప్రసాదాన్ని వండి వడ్డించేందుకు గాను తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన క్యాంటిన్‌లో పెద్ద పాత్రల్లో సాంబారు వండుతుంటారు.

గతంలోనూ ఇలాగే సాంబారులో ఓ ఉద్యోగి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+