వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం మానకపోతే ఇక్కడ ఉంటారు , లేకపోతే రాష్ట్రాన్ని వీడుతారు

సంపూర్ణ మద్యపాన నిషేఢం అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నానాపాట్లు పడుతున్నారు. మధ్యనిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మద

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీహర్ : సంపూర్ణ మద్యపాన నిషేఢం అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నానాపాట్లు పడుతున్నారు. మధ్యనిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మద్యానికి దూరంగా ఉంటేనే రాష్ట్రంలో ఉండాలని, లేకపోతే రాష్ట్రాన్ని వీడాలని ఆయన తేల్చి చెబుతున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మధ్య నిషేధాన్ని ఆయన అమల్లోకి తెచ్చారు. కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదనే ఆవేదనను సిఎం వ్యక్తం చేస్తున్నారు. సమర్థవంతంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

if u stay in bihar ,leave your drinking habbit

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కఠిన మధ్యపాన నిషేధ చట్టాన్ని ఉపసంహరించుకొంటున్నట్టు వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ రకమైన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సంపూర్ణంగా మద్యనిషేధాన్ని అమలు చేయాలనేది తమ ప్రభుత్వధ్యేయమని నితీష్ తేల్చి చెప్పారు.

పాట్నాలో జరిగిన మధ్యపాన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ ప్రభుత్వ లక్ష్యాన్ని మరోసారి వివరించారు. రాష్ట్రంలో ఉండాలంటే మద్యాన్ని మానివేయాల్సిందేనని తేల్చి చెప్పారు.మద్యాన్ని మానలేని వారు రాష్ట్రాన్ని వీడివెళ్ళాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఈ చట్లంలో మార్పుుల చేర్పులు చేసి కఠినంగా చట్టాన్ని అమలు చేసేందుకుగాను నితీష్ కుమార్ నవంబర్ 22వ, తేదిన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలను కూడ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది.

మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకొన్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే మద్య నిషేధం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది.ఆదాయం కోసం కాకుండా ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా నితీష్ కుమార్ చెబుతున్నారు.

English summary
if u stay in bihar ,leave your drinking habbit said bihar cm nitish kumar, a meeting conduct in patna about on prohibiton liquor, govt implement prohibition on liquor,on nov 24, nitish govenament conduct an all party meeting for strictly prohibiton liquor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X