మీలో ఎవరు కోటీశ్వరుడు: నాగ్ ఔట్, చిరు ఇన్?
హైదరాబాద్: బుల్లి తెరపై నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నుంచి అక్కినేని నాగార్జున తప్పుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ షో తెలుగు ప్రాంతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది మూడు సీజన్లు పూర్తి చేసుకుంది.
నాగార్జున స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఈ షోన్ నాలుగో సీజన్‌లో నడిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసు పాలనలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తర్వాత ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. ఖైదీ నెం.150 చిత్రం ద్వారా తిరిగి ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు.

అదే సమయంలో బుల్లి తెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడు షోను నడిపించి కోట్లాది ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఇటీవల చిరంజీవిపై ఓ ఫొటోషూట్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. నాగార్జున ఈ షో నుంచి తప్పుకోవడానికి తిరుగులేని కారణం ఉందని అంటున్నారు.
ఆయన కుమారులు నాగాచైతన్య, అఖిల్‌ల వివాహాలు జరగబోతున్నాయి. ఈ వివాహ వేడుకల కార్యక్రమాల కోసం తీరిక చేసుకోవడానికి నాగార్జున షోను చిరంజీవి చేతుల్లో పెడుతున్నట్లు చెబుతున్నారు. పెళ్లి పనులు పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చే విషయంపై నాగార్జున ఆలోచన చేస్తారట.












Click it and Unblock the Notifications