కారు కొంటున్నారా?: పార్కింగ్ స్థలం లేకుంటే షాకివ్వనున్న మోడీ
ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ వద్ద పార్కింగ్ స్థలం ఉన్నట్టు అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు.
న్యూఢిల్లీ: మీరు కారు కొంటున్నారా? మీ ఇంటి వద్ద పార్కింగ్ స్థలం లేదా? అయితే మీ కారు రిజిస్ట్రేషన్ కాదు. మీరు కారు కొనాలంటే ముందు మీరు పార్కింగ్ స్థలం కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
వాహనదారులకు షాకిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ వద్ద పార్కింగ్ స్థలం ఉన్నట్టు అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు.

రహదారుల పైన వాహనాల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం కేటాయించని కట్టడాలకు కూడా భవిష్యత్తులో అనుమతులు నిరాకరించనుంది.
ఈ విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గురువారం చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడానని, రాష్ట్రాలకు కూడా అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన యంత్రాంగం ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications