బీజేపీ నిర్ణయంతో జగన్‌లో సందిగ్ధం: గాలి కుమార్తె పెళ్లి గైర్హాజరికి కారణమదే!
బెంగుళూరు : అంతా అనుకున్నట్టే.. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మామూలుగా అయితే ఈ పెళ్లికి సెలబ్రిటీల తాకిడి ఎక్కువగానే ఉండాల్సింది. కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్ కారణంగా.. చాలామంది ప్రముఖులు ఈ పెళ్లికి దూరంగా ఉండిపోయారు.
జనార్దన్ రెడ్డి గతంలో బీజేపీలో పనిచేయడంతో చాలామంది పార్టీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఈ పెళ్లికి పార్టీ నేతలు హాజరైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంతో.. పార్టీ నేతలను పెళ్లికి దూరంగా ఉండేలా కట్టడి చేసింది బీజేపీ. అధికార పార్టీ బీజేపీ ఇంత కఠినంగా వ్యవహరించడంతో.. ఇతర ప్రముఖుల్లోను సందిగ్దం మొదలైంది. అందులో ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ ఒకరు అన్న చర్చ జరుగుతోంది.

తొలుత ఈ పెళ్లికి తాను గానీ లేదా కుటుంబ సభ్యులను గానీ పంపించాలని జగన్ భావించినప్పటికీ.. బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ఆయన పునరాలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. చివరకు పెళ్లికి వెళ్లకుండా ఉండడమే అన్ని విధాలా మేలు అన్న ఆలోచనకు వచ్చిన జగన్.. మొత్తానికి పెళ్లికి దూరంగా ఉండిపోయారు అన్న వాదన వినిపిస్తోంది.
ఇక బీజేపీ తరుపున కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, మరో ఇద్దరు ముగ్గురు నేతలు మినహా మరే బీజేపీ నేత పెళ్లికి హాజరవలేదు. అలాగే బయటినుంచి వచ్చిన ప్రముఖులు కూడా తక్కువే. మొత్తానికి ఇన్విటేషన్ కార్డులకు భారీ ఖర్చు చేసి మరీ.. అతిథులకు ఆహ్వానం పలికినా.. వారెవరూ పెళ్లి వైపు తొంగి చూడకపోవడం గమనార్హం. అయితే పెళ్లికి హాజరు కాని ప్రముఖులు రిసెప్షన్ కు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications